
మా ఊహలు పుట్టక మునుపే
మా ఊహలు పుట్టక మునుపే – మా సర్వమునెరిగిన దేవా (2) ఇహపరములలో నీవే – మా కోర్కెలు తీర్చెడి ప్రభువా (2) విశ్వాస నిరీక్షణతో – కనిపెట్టియున్నచో (2) పొందెదము ఎన్నో మేలులూ – ప్రభువా నీ పాద సన్నిధిలో (2) ||మా ఊహలు|| నిన్నడుగకుండగనే – మోషేను పిలచితివి నిన్నడిగిన సొలోమోనుకు – జ్ఞాన సిరుల నొసగిన దేవా (2) పలు సమయముల యందు – పలు వరముల నిచ్చితివి (2) అడుగనేల ప్రభువా ఈ ధరలో – నీ దివ్య కృపయే చాలు ||మా ఊహలు|| ప్రార్ధించుచుంటిమి – సమస్యలు తీర్చమని నిన్నడుగుచున్నాము నీ – రాజ్యములో చోటిమ్మని (2) ఊహించు వాటికంటె – అధికముగా నిచ్చెడి దేవా (2) ఇంతకంటె మాకేమి వలదు – నీ తోడు నీడే చాలు ||మా ఊహలు||


Follow Us