
మాట్లాడు! మాట్లాడు! నాతో మాట్లాడు
నాతో మాట్లాడు ప్రభువా ఒకసారి నాతో మాట్లాడు యేసు ఇంకొకసారి (2) బాధలో ఉన్నాను మాట్లాడవా - బలహీనమైయ్యాను మాట్లాడవా (2) మాట్లాడు! మాట్లాడు! నాతో మాట్లాడు - మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు (2) 1.యేసయ్యా నీవు మాట్లాడితే గ్రుడ్డివారు చూచారు కుంటివారు నడిచారు వ్యభిచారులు మారారు-దొంగలు దొరలైయ్యారు. ఎండిన ఎముకలన్నియు కదిలి నాట్యమాడాయి. ఎడారిలో నీటి బుగ్గలు పొంగి పొర్లి పారాయి (2) యేసయ్యా! మాట్లాడు! యేసయ్యా మాట్లాడు! యేసయ్యా మాట్లాడు 2.యేసయ్యా నీవు మాట్లాడితే నేను బ్రతికియున్నాను బ్రతుకుచు ఉన్నాను బలహీసమైన నేను బలం పొందుకున్నాను యేసయ్యా మరణిస్తాననుకున్నాను-మరల బ్రతుకుచున్నాను మాటలేరాని నేను పాట పాడుచున్నాను యేసయ్యా మాట్లాడు! యేసయ్యా మాట్లాడు! యేసయ్యా మాట్లాడు!!!


Follow Us