LOADING


Pastor Rajesh Ipc
Menu
    Close
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


మారని దేవుడవు


మారని దేవుడవు నీవేనయ్యా
మరుగై ఉండలేదు నీకు యేసయ్యా (2)
సుడులైనా సుడిగుండాలైనా – వ్యధలైనా వ్యాధి బాధలైనా
మరుగై ఉండలేదు నీకు యేసయ్యా (2)         ||మారని||

చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా
నిలకడలేని నా బ్రతుకును మార్చితివే (2)
మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా (2)
మరువని దేవుడవయ్యా మారని యేసయ్యా (2)       ||మారని||

నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగినా
నిత్య జీవ గమ్యానికి నను నడిపించితివే (2)
నిలచి ఉందునయ్యా నిజ దేవుడవనుచు (2)
నన్ను చూచినావయ్యా నన్ను కాచినావయ్యా (2)         ||మరని||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words