LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి


ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి
పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి
దీక్షతో నడుముకట్టి ఇంటింటి తలుపుతట్టి
యేసయ్య ఊసే చెప్పమ్మా - ఊరకనే ఉంటే తప్పమ్మా

ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా
పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మా
ఇక్కడ మాటలు అక్కడ చెప్పి - మంచిని చెడుగా తిప్పి
రెచ్చగొట్టే పనులే మానమ్మా - చిచ్చుబెట్టబాకే చిన్నమ్మా

కల్పించిన కథలంటే చెవి కోసుకుంటావమ్మా
చెడుమాటల సభలంటే నువ్వే ముందుంటావమ్మా
విన్నదానికి కొసరువేసి - ఉన్నదాన్ని మార్చేసి
కొండాలు చెప్పవద్దమ్మా - జగడాలు పెట్టకు పెద్దమ్మా

మంచిగ ఉన్నోళ్ళని చూస్తే కళ్ళెర్రజేస్తారమ్మా
హెచ్చింపబడుతూ ఉంటే అపనిందలు వేస్తావమ్మా
వ్యంగ్యపుమాటల కత్తులు దూసి - చల్లగ గుండెను కోసి
గాయాలు చెయ్యవద్దమ్మా - నోటికి ఉండాలి హద్దమ్మా

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words