
యుద్ధ వీరులం
యుద్ధ వీరులం - మనము యుద్ధ వీరులం -2 మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులం -2 భయపడము జడియము -2 అపవాడిని ఎదిరించే ఆత్మఖడ్గ యోధులం -2 యుద్ధ వీరులం - మనము యుద్ధ వీరులం కృపకు ఆధారమగు - ఆత్మ పొందియున్నాము పిరికి ఆత్మను పొంది - బానిసలము కాలేదు -2 బలహీనతలో - మనము బలవంతులమయ్యాము -2 శక్తిమంతుడగు యేసు - మనలో నిలిచి యుండగా -2 యుద్ధ వీరులం - మనము యుద్ధ వీరులం -2 విస్వాసమనే డాలు చేతితో పట్టుకొని మహిమ శిరస్త్రాణమును - యేసువలన పొందాము -2 సర్వాంగ కవచమును - ధరించుకొని యున్నాము -2 స్వీకృత పుత్రాత్మయే - జయం మనకు ఇవ్వగా -2 యుద్ధ వీరులం - మనము యుద్ధ వీరులం -2 మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులం -2 భయపడము జడియము -2 అపవాడిని ఎదిరించే ఆత్మఖడ్గ యోధులం -2 యుద్ధ వీరులం - మనము యుద్ధ వీరులం హోసన్నా - హోసన్నా - హోసన్నా యోధులమై సాగిపోదము


Follow Us