
ఆ రాజే నా రాజు – నా రాజే రారాజు
ఆ రాజే నా రాజు – నా రాజే రారాజు నా రాజు రాజులకు రాజు యేసు పుట్టెను ఈ లోకంలో ఆనందమే గొప్ప ఆనందమే ఆనందమే గొప్ప ఆనందమే సంతోషమే సర్వలోకమే యెష్షయి మొద్దున – దావీదు చిగురుగా లోక రక్షకుడు జన్మించెను లోక పాపాలను కడిగి వేయగా భువిలో బాలుడిగా అరుదించెను పరిశుద్ధాత్మ మూలముగా జన్మించెను మన పాపాలకు విరుగుడు మందును (తెచ్చెను) (తెచ్చి అందించెను) వీనుల విందుగా – దీనుల అండగా కరుణా కారకుడు కడలివచ్చెను పాపుల శాపాలను తానే మోయగా పరమ పాలకుడు పుడమి చేరెను కుల మత బేధాలను హరియించ వచ్చెను పరలోకానికి చేర్చే (మార్గమాయెను) (మార్గమై తనే నిలిచెను)


Follow Us