
యూదా స్తుతి గోత్రపు సింహమా
యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా (2) నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన (2) నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు (2) అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా|| నీ నీతి కిరణాలకై నా దిక్కు దెశలన్ని నీవేనని ఆనతికాలాన ప్రధమ ఫలముగా పక్వపరచిన నీకు (2) అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా|| నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుఁటలో నీకు (2) అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా||


Follow Us