
యెహోవా నా బలమా
యెహోవా నా బలమా యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ||యెహోవా|| నా శత్రువులు నను చుట్టిననూ నరకపు పాశములరికట్టిననూ వరదవలె భక్తిహీనులు పొర్లిన విడువక నను ఎడబాయని దేవా ||యెహోవా|| మరణపుటురులలో మరువక మొరలిడ ఉన్నతదుర్గమై రక్షనశృంగమై తన ఆలయములో నా మొఱ్ఱ వినెను ఆదరెను ధరణి భయకంపముచే ||యెహోవా|| నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును జలరాసులనుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు ||యెహోవా|| పౌరుషముగల ప్రభు కొపింపగా పర్వతముల పునాదులు వణకెను తన నోటనుండి వచ్చిన అగ్ని దహించివేసెను వైరులనెల్లన్ ||యెహోవా|| మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగ జేయును ఉరుముల మెరుపుల మెండుగ జేసి అపజయమిచ్చును అపవాదికిని ||యెహోవా|| దయగలవారిపై దయ చూపించును కఠినులయెడల వికటము జూపును గర్విష్టుల యొక్క గర్వమునణుచును సర్వమునెరిగిన సర్వాధికారి ||యెహోవా|| నా కాళ్ళను లేడి కాళ్లుగా జేయును ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి రక్షణ కేడెము నాకందించి అక్షయముగ తన పక్షము జేర్చిన ||యెహోవా|| యెహోవా జీవముగల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవే అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయ స్తుతిగానము చేసెద ||యెహోవా||


Follow Us