LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఆకర్షించుము దేవా


ఆకర్షించుము దేవా మమ్మాదరింపగ రావా
కాంక్షనీయుడా నీవే మా దేవ - కాపరి మా యేసు దేవా 

సాతాను శోధనలు మములాగుచున్నవి దేవా
కష్టాలు కన్నీళ్ళు మా గుండె నిండెను దేవా 
లోకము మమ్ము పిలుచుచున్నది - శోకసముద్రం పొంగుచున్నది 

నీ ఆత్మ వరములను మాకిమ్ము మా యేసు దేవ
నీ సేవ చేయుటకు మా శక్తి చాలదు దేవా 
సుఖము శరీరము కోరుచున్నది - మనస్సు ధనాశకు లాగుచున్నది 

మా ప్రియుడా నడుపుమయా - నీ ప్రేమ నీడలలోన
పాలు గోధుమ సారములు ఉన్నాయి - నీ సన్నిధాన 
పాపపు చెలిమి పిలుచుచున్నది - చీకటి బలము లాగుచున్నది

జీవజలాల ఊటలతో మా తోట తడుపుము దేవా
తియ్యని తేనీయ మాటలతో మా నోరు నింపుము దేవా 
సుమమధుర సహవాసముతో సాగెద నిరతము నీ సేవలో

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words