
యెహోవాయే నా కాపరిగా
యెహోవాయే నా కాపరిగా నాకేమి కొదువగును (2) పచ్చికగల చోట్లలో నన్నాయనే పరుండజేయును (2) శాంతికరమైన జలములలో (2) నన్నాయనే నడిపించును (2) ||యెహోవాయే|| గాఢాంధకార లోయలలో నడిచినా నేను భయపడను (2) నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును (2) నా తోడైయుండి నడిపించును (2) ||యెహోవాయే|| నా శత్రువుల ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచి (2) నా తల నూనెతో నంటియుంటివి (2) నా గిన్నె నిండి పొర్లుచున్నది (2) ||యెహోవాయే|| నా బ్రతుకు దినములన్నియును కృపాక్షేమాలు వెంట వచ్చును (2) నీ మందిరములో నే చిరకాలము (2) నివాసము చేయ నాశింతును (2) ||యెహోవాయే||


Follow Us