LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


యేసన్న స్వరమన్నా


యేసన్న స్వరమన్నా - నీవెపుడైనా విన్నావా

జనముల శబ్దము జలముల శబ్దము - బలమైన ఉరుములతో
కలసిన స్వరము - నిలచిన యేసు - పిలచిన పిలుపును నీవింటివా

ఏదేను తోటలో ఆదాము చెడగా - ఆదేవుడే పిలచె
ఆదాము ఎదుటకు అరుగాక దాగిన - అటులానె నీపును దాగేదవా

పనులను వదలి జనులను విడచి - నను కనుగొనుమనగా
కనిపెట్టి నందున ఘనుడబ్రహాముకు - కనిపించె మన కన్నతండ్రి యేసే

ఆనాడు దేవుడు మోషేను పిలువగ - ఆలకించెను స్వరము
ఈనాడు నీవును ఈస్వరము వినగా - కానాను చేరగ కదలిరావా

ఆరితిగానే సమూయేలు వినగా - ఆశీర్వాద మరపె
ధారాళముగను పరమ వరుని -దరిజేరుకొని నీవు సేవించుమా

సౌలా సౌలా నన్నేల హింసింతువు - చాలించుమనె స్వరము
సౌలాధిపతినంత సంధించగానే - సదృక్తుడై పౌలుగా మారెగా

స్వరమును వినగా పరమార్థజ్ఞాని - స్థిరుడైన యోహాను - పరమ
మర్మాలు భవిషద్విషయాలు - ప్రకటించే ప్రతిరోజు స్మరియించుమా

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words