
యేసయ్య నామం - ప్రీతిగల
యేసయ్య నామం - ప్రీతిగల నామం సాటి లేని నామం - మధుర నామం పాపము పోవును - భయమును పోవును పరమ సంతోషము - భక్తుల కీయును పరిమళ తైలము - యేసయ్య నామము భువిలో సువాసన - యిచ్చెడి నామము భూలోకమంతట - మేలైన నామము సైన్యాధిపతియగు - యేసయ్య నామము నిన్న నేడు - మారని నామము సూరు నమ్మినవారిని - విడువని నామము ప్రతివాని మోకాలు - వంచెడి నామము ప్రతి వాని నాలుక - స్తుతించెడి నామము సాతాను సేనను - జయించిన నామము పాప పిశాచిని - తరిమెడీ నామము భక్తుల కాచెడీ - శక్తిగల నామము పరమున చెర్బెడి - పరిశుద్ధ నామము


Follow Us