
యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా
యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు – పొందుకుంటావు శక్తిని (2) పాపాలను క్షమియించే – శక్తి కలిగినది యేసయ్య నామం పాపిని పవిత్రపరచే – శక్తి కలిగినది యేసయ్య నామం (2) రోగికి స్వస్థతనిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం మనసుకు నెమ్మదినిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం (2) దురాత్మలను పారద్రోలే – శక్తి కలిగినది యేసయ్య నామం దుఃఖితులను ఆదరించే – శక్తి కలిగినది యేసయ్య నామం (2) సృష్టిని శాసించగలిగిన – శక్తి కలిగినది యేసయ్య నామం మృతులను లేపగలిగిన – శక్తి కలిగినది యేసయ్య నామం (2) పాతాళాన్ని తప్పించే – శక్తి కలిగినది యేసయ్య నామం పరలోకానికి చేర్చే – శక్తి కలిగినది యేసయ్య నామం (2)


Follow Us