LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


యేసయ్య నీ ప్రేమ


యేసయ్య నీ ప్రేమ - ఆకాశముకంటె ఎత్తైనది
రాజులైన యాజక వంశములో - జన్మింపచేసితివయ్యా
నాయెడల నీకున్న నీ నిత్య సంకల్పమా 

రాతిగుండె గలవాడను - అయినా నను విడువలేదు
నీ చేతులు గాయాలైనా - జీవముగల రాయిగ మార్చి
నీ ప్రేమ మందిరమును - నాలో నిర్మించాలని
మూలరాయి నీవై నిలిచి - నీమీదే అమర్చితివి
మదినిండా నిండిపోతివి

యాకోబును ఇశ్రాయేలుగ - మార్చిన మహనీయుడవు
ఆత్మీయ ఇత్రాయేలుగ - నన్ను నీవు మార్చుకొంటివే
నన్నెంతో ప్రేమించితివి - నా దేవుడవైతివి
ఒంటరినైయున్న నాకు - చేతి కర్రవైతివి
నాస్వరం నీవైతివి

ఆకాశపక్షులకు గూళ్ళున్నాయంటివే
నీవు తల వాల్చుటకు - నేనున్నాను దేవా
రుచి చూచి ఎరిగితినీ - మధురమైన నీ ప్రేమ
విడలేను ఊపిరి కూడ - నీవులేని క్షణమునా

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words