
ఆకర్షించే ప్రియుడా…
ఆకర్షించే ప్రియుడా… అందమైన దైవమా… ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా పరిపూర్ణమైనవాడా నీదు తలపై ఉన్న అభిషేకం అధికంగా సువాసన వీచుచున్నది నీదు ప్రేమ చేతులు – ప్రేమించే చేతులు నీదు ప్రేమ చూపులే నాకు చాలు నీ నోట నుండి తేనె ఒలుకుచున్నది నీదు మాటలు ఎంతో మధురంగా ఉన్నవి నీదు ప్రేమ పాదం – పరిశుద్ధ పాదం అదియే నేను వసియించే స్థలము నిన్ను పాడి హృదయం ఆనందించును నాట్యంతో పాటలు పాడెదను దేవాది దేవుడని – ప్రభువుల ప్రభువని అందరికి నిన్ను చాటి చెప్పెదను


Follow Us