LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


యేసయ్య! నను కొరుకున్న


యేసయ్య! నను కొరుకున్న నిజస్నేహితుడా
నీ యవ్వన రక్తము కార్చి - నీ ప్రేమ ప్రపంచంలో చేర్చినావు } 2
నిను వీడి జీవింప నా తరమా
నిను ఆరాధింప నా బలమా !
మది మందిరాన కొలువైన నా వరమా !! } 2

నా పూర్ణ హ్రుదయముతో నిన్ను వెదికితిని
నీ ఆజ్ఞలను విడిచి - నన్ను తిరుగనియ్యకుము } 2
దైర్యమునిచ్చే - నీ వాక్యములో
నీ బలము పొంది - దుష్టుని ఎదిరింతును } 2|| యేసయ్య ||

నా గురి గమ్యమైన నిను చేరిటకు
ఈ లోక నటనలు చూచి - నన్ను మురిసిపోనివ్వకు
పొందబోవు -బహుమానమునకై
నా సిలువను మోయుచు - నిను వెంబడించెదను } 2|| యేసయ్య ||

నీ సంపూర్ణ సమర్పణయే - లోక కళ్యాణము
నీ శక్తి సంపన్నతలే - ఇల ముక్తిప్రసన్నతలు
మహనీయమైన - నీ పవిత్రతను
నా జీవితమంతయు ఘనముగ ప్రకటింతును } 2

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words