LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


యేసయ్యా నిన్ను చూడాలని ఆశ


యేసయ్యా నిన్ను చూడాలని ఆశ
మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ (2)
ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో
ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు
ఇమ్మానుయేలైన నా దైవం నీవేగా (2)         ||యేసయ్యా||

అందరు ఉన్నారని అందరు నావారని (2)
తలచితిని భ్రమచితిని చివరికి ఒంటరి నేనైతిని (2)
చివరికి ఒంటరి నేనైతిని
నా గానం నీవయ్యా నా ధ్యానం నీవయ్యా
నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీవయ్యా        ||యేసయ్యా||

అంధకారములో అంధుడ నేనైతిని (2)
నిను చూచే నేత్రములు నాకొసగుమా నజరేయుడా (2)
నాకొసగుమా నజరేయుడా
నా ఆశ నీవయ్యా నా ధ్యాస నీవయ్యా
నా భాష నీవయ్యా నా శ్వాస నీవయ్యా        ||యేసయ్యా||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words