
యేసయ్యా నీ కృపా
యేసయ్యా నీ కృపా - నను అమరత్వానికి అర్హునిగా మార్చెను - యేసయ్యా నీ కృపా || యేసయ్యా || నీ హస్తపు నీడకు పరుగెత్తగా - నీ శాశ్వత కృపతో నింపితివా నీ సన్నిధిలో దీనుడనై - కాచుకొనెద నీ కృప ఎన్నడు || యేసయ్యా || నీ నిత్య మహిమకు పిలిచితివా - నీ స్వాస్ధ్యముగా నన్ను మార్చితివా ఆత్మాభిషేకముతో స్ధిరపరచిన - ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును || యేసయ్యా || గువ్వవలె నే నెరిగి నిను చేరనా - నీ కౌగిటనే నొదిగి హర్షించనా ఈ కోరిక నాలో తీరునా ? - రాకడలోనే తీరును || యేసయ్యా ||


Follow Us