
యేసయ్యా నీ ఘన నామం
యేసయ్యా నీ ఘన నామం ఆరాధించుటయే నా భాగ్యం తరతరాలు మారిన గాని - మార్పులేని దేవుడవు నీవే నిత్యజీవము ఇశ్రాయేలు విడుదల కొరకు - దిగివచ్చిన దేవుడవు ఇస్సాకు బదులుగ నీవు - వధకు సిద్ధమైతివి యీలోక పాపభారం మోయు గొర్రె వైతివి నా స్థానమందు నిలిచి - మరణ శిక్ష నొందితివి నీ కొరకు జీవించెదను - నీ ఋణము తీర్చుకొంటు కృపచేత నను రక్షించి - నీతి మంతునిగ మార్చి నీ వాక్య బలముతో నన్ను పోషించు చుంటివి ఆత్మీయ పోరాటములో - నేనోడి పోకుండ సైన్యములకధిపతియైన - నా తండ్రి యెహోవ దేవా పోరాడి గెలుపొందుటకు - నీ ఆత్మతో నడిపించు ఇంటిమీద ఒంటిగ ఉన్న పిచ్చుకవలె నుంటిని నా కష్టకాలము నందు మొరపెట్టగ వింటివి నా ప్రాణము నిన్ను నమ్ముకొని మౌనముగా ఉన్నది నిన్ను నమ్ముకున్నవారిని ఏనాడు విడువలేదుగ నీ బండ సందులలోన నాకు చోటు నిచ్చితివి నా దాగుచోటువైతివి


Follow Us