LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


యేసుని కొరకై యిల


యేసుని కొరకై యిల జీవించెద - భాసురముగనే నను దినము
దోషములన్నియు బాపెను మోక్ష - నివాసమున ప్రభు జేర్చునుగా 

నాశనకరమగు గుంటలో నుండియు - మోసకరంబగు యూబినుండి
నా చేతి నిలపై కెత్తెను నన్ను పిశాచి పథంబున దొలగించెను

పలు విధముల పాపంబును జేసితి - వలదని ద్రోసితి వాక్యమును
కలుషము బాపెను కరుణను బిలిచెను - సిలువలో నన్నాకర్షించెను 

అలయక సాలయక సాగిపోదును - వెలయగ నా ప్రభు మార్గములు
కలిగెను నెమ్మది కలువరిగిరిలో - విలువగు రక్తము చిందించిన ప్రభు 

శోధన బాధలు శ్రమలిల కల్గిన - ఆదుకొనును నా ప్రభువనిశం
వ్యాధులు లేములు మరణము వచ్చిన - నాధుడే నా నిరీక్షణగున్

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words