
యేసుని స్తుతియించువారూ
యేసుని స్తుతియించువారూ - నిత్యజీవము పొందెదరు ఆనందముతో దినదినము - సంతోషముతో నుందురు వాడబారని ఆకువలె - దినదినము బలమొందెదరు జీవజలపు నది యొడ్డున - వృక్షములవలె పెరిగెదరు ఆ.. హల్లెలూయ చీకటి నుండి వెలుగునకు - మరణమునుండి జీవముకు చేయి విడువక తనతోకూడ - యేసే నడిపించును ఆ హల్లెలూయ చీకు చింతలు కలిగినను చెరలో దుఃఖము కలిగినను కనురెప్పవలె కాపాడి - యేసే విడిపించును హల్లెలూయ నడిసంద్రములో పయనించినా - నట్టడవులలో నివసించినా ఎన్నడు మరువక ఎడబాయకా - యేసే తోడుండును ఆ. హల్లెలూయ


Follow Us