
యేసుని స్వీకరించు
యేసుని స్వీకరించు - క్రీస్తేసుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము - తానే ప్రవేశించును కనికరమందైశ్వర్యుండు - నిన్ను వాత్సల్యముతో విమోచించును భయంకరమైన పాపమునుండి - విడిపింపనిన్ను వెదకి వచ్చెన్ మన్నించు సర్వపాపంబులన్ - తానె మాన్పును సర్వరోగములన్ కృపకనికరముల మకుటము నీకు - ధరియింపజేసి ఘనపరచున్ అంధులకు దృష్టి కలుగజేసి - అంగహీనులను లేపి నడువజే సెన్ పలువిధములగు వ్యాధిగ్రస్తులకు - స్వస్థతనిచ్చెను తక్షణమే పాపభారమును భరియించెన్ - నీ రోగములన్నిటి తొలగించెన్ సహించెను కొరడా దెబ్బల బాధలు - జయించెను అన్ని శోధనలస్ కలువరి సిలువలో వ్రేలాడి - తన రక్తము చిందించే ధారలుగా చేతులలో తన కాళ్ళల సీలలు - ముండ్ల కిరీటము ధరియించె జీవమిచ్చుటకు ప్రాణమిడి - మరి జయించెను ప్రతివిధశోధనలు నీ కొరకై మరణించి లేచెను - శక్తిమంతుడె నిను రక్షింప


Follow Us