
యేసే గొప్ప దేవుడు
యేసే గొప్ప దేవుడు - మన యేసే శక్తిమంతుడు యేసే ప్రేమ పూర్ణుడు-యుగయుగముల స్తుతిపాత్రుడు (2) అ.ప.: స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి-ఘనత బలము కలుగును ఆమెన్ (2) 1.మహా శ్రమలలో వ్యాధి బాధలలో-సహనము చూపి స్థిరముగా నిల్చిన యోబు వలెనే జీవించెదను (2) అద్వితీయుడు ఆది సంభూతుడు-దీర్ఘశాంతుడు మన ప్రభుయేసే 2.ప్రార్ధన శక్తితో ఆత్మ బలముతో-లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును (2) మహోన్నతుడు మన రక్షకుడు-ఆశ్రయ దుర్గము మన ప్రభుయేసే 3.జీవితమంత ప్రభుతో నడిచి-ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన హనోకు వలెనే జీవించెదను (2) అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు-నీతి సూర్యుడు మన ప్రభు యేసే


Follow Us