LOADING

Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu

యేసే నా పరిహారి

యేసే నా పరిహారి
ప్రియ యేసే నా పరిహారి
నా జీవిత కాలమెల్ల
ప్రియ ప్రభువే నా పరిహారి (2)         ||యేసే నా||

ఎన్ని కష్టాలు కలిగిననూ
నన్ను కృంగించె భాదలెన్నో (2)
ఎన్ని నష్టాలు వాటిల్లినా
ప్రియ ప్రభువే నా పరిహారి (2)         ||యేసే నా||

నన్ను సాతాను వెంబడించినా
నన్ను శత్రువు ఎదిరించినా (2)
పలు నిందలు నను చుట్టినా
ప్రియ ప్రభువే నా పరిహారి (2)          ||యేసే నా||

మణి మాన్యాలు లేకున్ననూ
పలు వేదనలు వేధించినా (2)
నరులెల్లరు నను విడచినా
ప్రియ ప్రభువే నా పరిహారి (2)         ||యేసే నా||

బహు వ్యాధులు నను సోకినా
నాకు శాంతి కరువైనా (2)
నను శోధకుడు శోధించినా
ప్రియ ప్రభువే నా పరిహారి (2)          ||యేసే నా||

దేవా నీవే నా ఆధారం
నీ ప్రేమకు సాటెవ్వరూ (2)
నా జీవిత కాలమంతా
నిన్ను పాడి స్తుతించెదను (2)          ||యేసే నా||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words