
రండి యుత్సాహించి
రండి యుత్సాహించి పాడుదము - రక్షణదుర్గము మన ప్రభువే రండి కృతజృత స్తోత్రముతో - రారాజు సన్నిది కేగుదము సత్సలునామము కీర్తనలన్ - సంతోష గానము చేయుదము మన ప్రభువే మహాదేవుండు - ఘన మహాత్మ్యముగల రాజు భూమ్యాగారపు లోయలును - భూతల శిఖరము లాయనవే సముద్రము సృష్టించే నాయనదే - సత్యునిహస్తమే భువిన్ జేసిన ఆయన దైవము పాలితుల - మాయన మేపెడి గొశైలము ఆ ప్రభు సన్నిధి మోకరించి - ఆయన ముందర మ్రొక్కుదము ఆయన మాటలు గైకొనిన - నయ్యని మీకెంత మేలగును తండ్రి కుమార శుద్దాత్మకును - దగుస్తుతి మహిమలు కల్గుగాక ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు - నయినట్లు యుగములనౌను ఆమెన్


Follow Us