
రండి రండి యేసుని
రండి రండి యేసుని - యొద్దకు రమ్మనుచున్నాడు అ.ప.ప్రయాసపడి భారము మోయువారలు - ప్రభుని చెంతకు పరుగిడి వేగమే యేసుని పిలుపు వినియు నింక - యోచింప రేల అవనిలో అగచాట్లపాలైన - దొరకదు శాంతి ఆత్మకు నిలలో కరువు రణము మరణము చూచి - మనస్సు మార్చరేలా యూదులు పాలస్తీన చేరుటలో - ప్రవచనములు సంపూర్ణము లాయెను ప్రభుయేసు నీ కొరకై తనదు - ప్రాణము నిచ్చెగదా సిలువలో రక్తము చిందించియును - బలియాయెను యా ఘనుడు మనకై యేసుని నామము నందే-పరమ నివాసము దొరకును ముక్తిని పాపవిమోచనమును - శక్తిమంతుడు యేసే యిచ్చును నేనే మార్గము నేనే - సత్యము నేనే జీవమును నేనేగాకింకెవ్వరు లేరని - ఎంచి చెప్పిన యేసుని యొద్దకు హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ


Follow Us