LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఆకాశ పక్షులను చూడండి


ఆకాశ పక్షులను చూడండి
అవి విత్తవు అవి కోయవు
గరిసెలలో దాచుకోవూ
కొట్లలో కూర్చుకోవు          ||ఆకాశ||

అనుదినము కావలసిన ఆహారము
అందజేయును వాటికి ఆ దేవుడు
కలసికట్టుగా అవి ఎగిరి పోతాయి
కడుపు నింపుకొనిపోయి మరల తిరిగి వస్తాయి          ||ఆకాశ||

స్వార్ధము వంచన వాటికుండదు
సాటివాని దోచుకొనే మనసు ఉండదు
రేపటిని గూర్చిన చింత ఉండదు
పూట ఎలా గడపాలని బాధ ఉండదు          ||ఆకాశ||

పక్షులను పోషించే ఆ దేవుడు
మనుష్యులను పోషించుట మానివేయునా
సృష్టిలోన మనిషి బ్రతుకు శ్రేష్టము కదా
ప్రభువు తోడు ఉండగా మనకు ఎందుకు బాధ          ||ఆకాశ||


Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words