
రండి సువార్త
రండి సువార్త సునాదముతో - రంజిలు సిలువ నినాదముతో తంబుర సితార నాదముతో - ప్రభుయేసు దయానిధి సన్నిధికి యేసే మానవజాతి విలాసం - యేసే మానవ నీతి వికాసం యేసే పతిత పావన నామం - బాసుర క్రైస్తవ శుభనామం యేసే దేవుని ప్రేమస్వరూపం - యేసే సర్వేశ్వర ప్రతి రూపం యేసే ప్రజాపతి పరమేశం - ఆశ్రిత జనముల సుఖవాసం యేసే సిలువను మోసిన దైవం - యేసే ఆత్మల శాశ్వత జీవం యేసే క్షమాపణా యధికారం - దాసుల ప్రార్ధన సహకారం యేసే సంఘములో మనకాంతి - యేసే హృదయములో ఘనశాం యేసే కుటుంబ జీవన జ్యోతి - పసిపాపల దీవెనమూర్తి యేసే జీవన ముక్తికి మార్గం - యేసే భక్తుల భూతల స్వర్గం యేసే ప్రపంచ శాంతికి సూత్రం - వాసిగ నమ్మిన జనస్తోత్రం


Follow Us