
రమ్మూ నీ తరుణమిదే
రమ్మూ నీ తరుణమిదే -రమ్మనుచున్నాడు - నీ ప్రభువైన యేసు నొద్దకు జీవితమంతయు వ్యర్ధముగను - దుఃఖముతోను గడుపుటయేల ఆయన శరణు జొచ్చినచో - వాంఛతో నిన్ను స్వీకరించున్ కట్టిన యిల్లు ధనధాన్యములు - కనబడు బంధుమిత్రాదులును గూడు విడచి నీవు పోయినచో - వెంటనీతో రారెవరు అందము మాయ నిలకడలేనిది - దాని నమ్మకుము మోసగించును మరణము ఒకనాడు వచ్చున్ - మరువకు నీ ప్రభువును మిన్ను క్రిందన్ భూమిమీదన్ - మిత్రుడు యేసు నామముగాక రక్షణ పొందుదారిలేదు - రక్షకుడే సే మార్గము తీరని పాపవ్యాధులను - మారని నీదు బలహీనమును ఘోర సిలువలో మోసి తీర్చెన్ - గాయములచే బాగుపడన్ సత్యవాక్కును నమ్మిరమ్ము - నిత్యజీవమున్ నీకిచ్చును నీ పేరు జీవపుస్తకమునందు - నిజముగ ఈనాడే వ్రాయున్


Follow Us