
రాజ జగమెరిగిన
రాజ జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మనబంధము అనుబంధము } 2 విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను? || రాజ ||} 2 దీన స్థితియందున సంపన్న స్థితియందున నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే } 2 నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్రబలులు నీకే అర్పించెద యేసయ్యా } 2|| రాజ || బలహీనతలయందున అవమానములయందున పడినను కృంగినను నీకృప కలిగియుందునే } 2 నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్రబలులు నీకే అర్పించెద యేసయ్యా } 2|| రాజ || సీయోను షాలేము మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి యుందునే } 2 నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్రబలులు నీకే అర్పించెద యేసయ్యా } 2


Follow Us