LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


రాజాధి రాజ


రాజాధి రాజ రవి కోటి తేజ
రమణీయ సామ్రాజ్య పరిపాలక (2)
విడువని కృప నాలో స్థాపించెనే
సీయోనులో నున్న స్తుతుల సింహాసనమును (2)        ||రాజాధి||

వర్ణనకందని పరిపూర్ణమైన నీ
మహిమ స్వరూపమును – నా కొరకే త్యాగము చేసి (2)
కృపా సత్యములతో కాపాడుచున్నావు
దినమెల్ల నీ కీర్తి మహిమలను – నేను ప్రకటించెద (2)        ||రాజాధి||

ఊహలకందని ఉన్నతమైన నీ
ఉద్దేశములను – నా యెడల సఫలపరచి (2)
ఊరేగించుచున్నావు విజయోత్సవముతో
యేసయ్య నీ కన్నా తోడెవ్వరు – లేరు ఈ ధరణిలో (2)        ||రాజాధి||

మకుటము ధరించిన మహారాజువై నీ
సౌభాగ్యమును – నా కొరకే సిద్ధపరచితివి (2)
నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి
నీ సాక్షినై కాంక్షతో పాడెద – స్తోత్ర సంకీర్తనలే (2)        ||రాజాధి||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words