
ఆకాశ మహా-కాశంబులు
ఆకాశ మహా-కాశంబులు పట్టని ఆశ్చర్యకరుడా కృప జూపి నిబంధనను నెరవేర్చిన ఉపకారి కాపాడితివి నడిపితివి నీ యింటికి మమ్ములను నీ దాసునికి నీ ప్రజలకు నీ క్షమను కనుపరచు నీదు కల్వరి రక్తమున నీవే కడుగు కరుణామయా నీతి న్యాయముల కర్త ప్రీతి తోడ నీ ప్రజలకు నీతి న్యాయముల నిమ్ము స్తుతియింప నిరతంబు రాజులనుగా యాజకులనుగా మమ్ము చేసిన మహారాజ విజయమిమ్ము మా విజయుండా నిజమైన నీ ప్రజలకు బలపరచు నీ భక్తులను బలము తోడ ప్రవేశించి విలువైన నీ రక్షణను ధరింప చేయుము హల్లెలూయా


Follow Us