LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


రారాజు వస్తున్నాడో


రారాజు వస్తున్నాడో
జనులారా.. రాజ్యం తెస్తున్నాడో
త్వరపడి వేగమే రండి
ప్రియులారా.. ప్రభుని చేరగ రండి
వస్తానన్న యేసు రాజు రాక మానునా
తెస్తానన్న బహుమానం తేక మానునా (2)       ||రారాజు||

పాపానికి జీతం రెండవ మరణం
అది అగ్ని గుండము అందులో వేదన (2)
మహిమకు యేసే మార్గము జీవము (2)
అందుకే నమ్ముకో యేసయ్యను
పొందుకో నీ పాప పరిహారము (2)       ||వస్తానన్న||

పాపం చెయ్యొద్దు మహా శాపమయ్యేను
ఈ పాప ఫలితం ఈ రోగ రుగ్మతలు (2)
యేసయ్య గాయాలు స్వస్థతకు కారణం
యేసయ్య గాయాలు రక్షణకు మార్గం
అందుకే నమ్ముకో యేసయ్యను
పొందుకో నీ పాప పరిహారము (2)       ||వస్తానన్న||

కనురెప్ప పాటున కడబూర మ్రోగగా
పరమున ఉందురు నమ్మిన వారందరు (2)
నమ్మని వారందరు శ్రమల పాలవుతారు (2)
అందుకే నమ్ముకో యేసయ్యను
చేరుకో పరలోక రాజ్యంబును (2)       ||వస్తానన్న||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words