
రారే చూతము
రారే చూతము రాజసుతుని రేయి జనన మాయెను (2) రాజులకు రారాజు మెస్సయ్యా (2) రాజితంబగు తేజమదిగో (2) ||రారే|| దూత గణములన్ దేరి చూడరే దైవ వాక్కులన్ దెల్పగా (2) దేవుడే మన దీనరూపున (2) ధరణి కరిగె-నీ దినమున (2) ||రారే|| కల్లగాదిది కలయు గాదిది గొల్ల బోయుల దర్శనం (2) తెల్లగానదే తేజరిల్లెడి (2) తార గాంచరే త్వరగ రారే (2) ||రారే|| బాలు-డడుగో వేల సూర్యుల బోలు సద్గుణ శీలుడు (2) బాల బాలిక బాలవృద్ధుల (2) నేల గల్గిన నాథుడు (2) ||రారే|| యూదవంశము నుద్ధరింప దావీదుపురమున నుద్భవించె (2) సదమలంబగు మదిని గొల్చిన (2) సర్వ జనులకు సార్వభౌముడు (2) ||రారే||


Follow Us