
రాలిపోదువో నీవు
రాలిపోదువో నీవు కూలిపోదువో - తెలియదురా నీకు ఏఘడియో అయ్యో పువ్వురాలు విధమున రాలిపోదువో అయ్యో మానవ “మాయరా ఇది మాయరా" రేపు నీది కాదని తెలుసుకో బుడగవురా నీవు బ్రతుకవురా వట్టివిరా నీవు మట్టివిరా కోరకురా నీవు కొర్కెలను - వుండరా నీవు మన్నువురా కుండవురా - నీవు పగిలెదవు నీవు పొయినపుడు ఏడ్చెదరే గాని ఎవ్వరు రారయ్యా నీ వెంట ఎందరు ఉన్న నీ ఒక్కడవే శాశ్వతమా నీకు ఈ లోకము - శాశ్వతమైనది పరలోకము మరణించెరా ప్రభు నీ కోసం అయ్యో మానవ సత్యమురా ఇది సత్యమురా


Follow Us