
రేయి పగలు
రేయి పగలు నీ పాదసేవే - జీవదాయక చేయుట మేలు సాటిలేని దేవుడ నీవే - నాదుకోట కొండయు నీవే పరమపురిలో దేవా నిరతం - దూత గణములు స్తుతులను సల్ప శుద్ధుడు పరిశుద్ధుడనుచు - పూజ నొందే దేవుడ నీవే జిగటమన్నే మానవులంతా - పరమ కుమ్మరి ప్రభుడవు నీవే సృష్టికర్తను మరచి జనులు - సృష్టినే పూజించుట తగునా పెంట కుప్పలనుండి దీనుల - పైకి లేపు ప్రభుడవు నీవే గర్వమణచి గద్దెలు దింపి - ఘనులనైనా మేపవా గడ్డి నరుల నమ్ముటకంటె నిజముగ - నీదు శరణం శరణం దేవా రాజులను ధరనమ్ముటకంటె - రాజరాజవు నాకాశ్రయము అగ్నివాసన నంటకుండా - అబెద్నగోలతో నుండిన దేవా దానియేలును సింహపు బోనులో - ఆదుకున్న నాధుడ నీవే పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు - పరము జేర్చే పథము నీవే అడుగుజాడలో నడచిన హానోకు - పరముచేరే ప్రాణముతోడ మృతుల సహితము లేపినావు - మృతిని గెల్చి లేచినావు మృతులనెల్ల లేపేవాడవు - మృత్యువును మృతి జేసితి నీవు


Follow Us