
వధియింపబడిన గొర్రెపిల్లా
వధియింపబడిన గొర్రెపిల్లా – సింహాసనాసీనుడా (2) నీ రక్తమిచ్చి… ప్రాణమిచ్చి… మమ్ములను కొన్నావే ప్రతి జనములో… నీ ప్రజలను… నీ యాజక రాజ్యము చేసావే రక్షణ జ్ఞానము స్తోత్రము – శక్తియు ఐశ్వర్యము నీదే రాజ్యము బలము ప్రభావము – మహిమ ఘనత నీదే అర్హుడా.. యోగ్యుడా.. కృతజ్ఞతకు పాత్రుడా (2) ||వధియింప|| అన్నిటికి పైనున్నావు – అందరిని చూస్తున్నావు అధికారం ఇచ్చే మహా దేవుడవు ఆకాశ భూములయందు ఈ సృష్టి సర్వమునందు నీ చిత్తము జరిగించే మహారాజు నువ్వు నీ రాజ్యము నిలుచును నిరతము నీదేగా సర్వాధికారము నీవెవ్వరికి ఇత్తువో వారిదే ఔను భూ రాజ్యము మహోన్నతుడు యేసుని శుద్ధులదే ఈ అధికారము ||రక్షణ|| దృశ్యములు అదృశ్యములు – ఆకాశ భూజల జీవులు అన్నియును నీ యందే సృజియింపబడెన్ సింహాసన ప్రభుత్వములు – ప్రధానులు అధికారములు అందరును నీ శాసనముకు లోబడును నీ మాటతో ఏలెడి ప్రభుడవు నీవొకడివే సృష్టికి కర్తవు పరలోక పెద్దలందరు తమ కిరీటము తీసి నిన్ను కొలుతురే భూ రాజులు నివాసులు తమ మహిమనంతా తెచ్చి పూజింతురే ||రక్షణ|| దావీదు చిగురువు నువ్వు – యూదా స్తుతి సింహము నువ్వు దావీదు తాళపు చెవి యజమానుడవు నువ్వు తలుపును మూసావంటే – తెరిచేటి వారే లేరు నువ్వు తెరిచిన తలుపును మూసే వారెవరు నీ భుజములపై రాజ్య భారము నీదేగా నిత్య సింహాసనము భూరాజ్యములన్నింటిని కూలగొట్టి నిలుచును నీ రాజ్యము నిను విశ్వసించు వారికే చెందుతుంది నీ సత్య రాజ్యము ||రక్షణ|| సెరాపులు కెరూబులచే – పరిశుద్ధుడు పరిశుద్ధుడని తరతరములు కొనియాడబడే శుద్ధుడవు నీ స్తుతిని ప్రచురము చేయ – మమ్మును నిర్మించావయ్యా మా ఆరాధనకు నీవే యోగ్యుడవు నీ నామము బహు పూజనీయము ప్రతి నామమునకు పై నామము ప్రతి వాని మోకాలును ప్రభు యేసు నామమందున వంగును ప్రతి నాలుక యేసుడే అద్వితీయ ప్రభువని ఒప్పును ||రక్షణ||


Follow Us