
వాడబారని విశ్వాసముతో
వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో (2) వేచియున్నానయ్యా కనిపెట్టుచున్నానయ్యా (2) యేసయ్యా నీ రాక కోసమై – కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై – నిన్ను చేరుటకై (2) ||వాడబారని|| మోకాళ్లపై వేచితి – కన్నీళ్ల పర్యంతమై బీడు బారిన నేల వానకై – ఎదురు చూచినా సంఘమై (2) సిద్ధపడియున్న వధువునై ఆశతో వేచానయ్యా (2) యేసయ్యా ||నీ రాక|| లేఖనములను చూచితి – గురుతులు గమనించితి ప్రవచన నెరవేర్పులన్ని – జరుగుట గుర్తించితి (2) రారాజువై నీవు రావాలని ఎదురు చూచుచున్నానయ్యా (2) యేసయ్యా ||నీ రాక|| నీటి కొరకై వేచిన – గూడ బాతును పోలిన ఆత్మ దాహము తోడనిండి – అల్లాడుచున్నానయ్యా (2) లోక బంధాల నుండి నీ చెలిమి కోరానయ్యా (2) యేసయ్యా ||నీ రాక||


Follow Us