
విజయశీలుడా
విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిను స్తుతించెదను నా యేసయ్యా నిను వేడుకొనగా నా కార్యములన్నియు సఫలము చేసితివి అలసిన సమయమున – నా ప్రాణములో త్రాణ పుట్టించినావు ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు నిత్యానందము కలిగించె నీ శుభ వచనములతో – నెమ్మదినిచ్చితివి ఆశ్చర్యకరముగ – నీ బాహువు చాపి విడుదల కలిగించినావు అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు నీ స్వాస్థ్యమునకు తండ్రిగ నిలిచి వాగ్ధాన భూమిలో – చేర్చిన దేవా ఆరోగ్యకరమైన నీ – రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు అక్షయుడా నా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేము నిర్మించుచున్నావు


Follow Us