
వేటకాని ఉరిలో
వేటకాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు (2) లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగామా నా కేడెమా (2) ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన (2) రాత్రి వేళ భయముకైననూ పగటి వేళ బానమైననూ (2) రోగము నన్నేమి చేయదు నా గుడారాన్ని సమీపించదు (2) ||లేనే లేదయ్యా|| మానవుల కాపాడుటకు దూతలను ఏర్పరచాడు (2) రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకొనును (2) ||లేనే లేదయ్యా||


Follow Us