
వేవేల దూతలతో
వేవేల దూతలతో కొనియాడబడుచున్న నిత్యుడగు తండ్రి సమాధాన కర్త బలవంతుడైన దేవా ||వేవేల|| మా కొరకు నీ ప్రాణం సిలువలో త్యాగం నే మరువలేను నా దేవా (2) ఏమిచ్చి నీ ఋణము – నే తీర్చగలను (2) ఈ భువిలో నీ కొరకు ఏమివ్వగలను (2) ||వేవేల|| మా స్థితిని మా గతిని నీవు మార్చగలవు మా బాధలు మా వేదన నీవు తీర్చగలవు (2) ఎంత వేదనైనా – ఎంత శోధనైనా (2) మా కొరకు సిలువలో బలి అయినావు (2) ||వేవేల||


Follow Us