
శిలనైన నన్ను
శిలనైన నన్ను శిల్పివై మార్చావు నాలోని ఆశలు విస్తరింపచేసావు (2) నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు (2) నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైన|| మోడుబారిన నా జీవితం నీ ప్రేమతోనే చిగురింపచేసావు (2) నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం (2) వర్ణించలేను లెక్కించలేను (2) నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైన|| ఏ విలువలేని అభాగ్యుడను నేను నీ ప్రేమచూపి విలువనిచ్చి కొన్నావు (2) నాయెడల నీకున్న తలంపులు విస్తారం (2) నీ కొరకే నేను జీవింతు ఇలలో (2) నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైన|| ఊహించలేను నీ ప్రేమ మధురం నా ప్రేమ మూర్తి నీకే నా వందనం (2) నీ ప్రేమే నాకాధారం – నా జీవిత లక్ష్యం (2) నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైన||


Follow Us