
సజీవుడేసుని
సజీవుడేసుని రక్తములో - కడుగబడిన జనమా సమాధి గెలిచిన దేవునిచే - నాటబడిన వనమా యువజనమా - ఏసులో బలపడుమా జడియకుమా - ఏసుకై పరుగిడుమా జీవితకాలం స్వల్పం - యవ్వనమెంతో శ్రేష్టం నీయవన బలం - ఏసుకై వాడిన - జీవితమే ఫలవంతం ఆకర్షించేలోకం - ఆశల నాశన కూపం లోకాశలను జయించుచు సాగిన చేరెదవు పరలోకం దేవుని తోటయే సంఘం - పనిచేయుట నీధర్మం నీవరములను రెట్టింపు చేసిన పొందెదవు బహుమానం


Follow Us