
సంతోషం ఉత్సాహం
సంతోషం ఉత్సాహం కలసిన జయగీతం - యేసే మా రక్షకుడు ఇదే మా నినాదం - మనమాయన ప్రజలం ఆయన మేపు గొర్రెలం స్తుతి చేయుచు ప్రకటించుచు ప్రభు కృపలో సాగెదం చితికిన మా బ్రతుకులను అతికినాడని - గతుకులసుడి దారినుండి లేపినాడని - అధికమైన ప్రేమతో చేరదీసినాడని తన రక్షణ కౌగిటిలో కాపాడుచున్నాడని ధరను ప్రేమించిన నర రూపధారుడని - నరులకై తన ప్రాణం ధారపోసినాడని - మృతిని గెల్చి తిరిగి లేచి విజయమిచ్చాడని తన సంఘవధువుకై తిరిగి రానున్నాడని భూదిగంత వాసులారా - యేసువైపు చూడుడి - దీనమనస్సుతో ప్రభుని ఆశ్రయించుడి - దురలవాట్లకీడునుండి విమోచించెను మనశాంతి రోగశుద్ధి మోక్ష ప్రాప్తినిచ్చును


Follow Us