
సందేహమేల
సందేహమేల - సంశయమదేల- ప్రభుయేసు గాయములను పరికించి చూడు - గాయములలో నీ వ్రేలు తాకించి చూడు ఆ ముళ్ళ మకుటమునీకై - ధరియించెనే - నీ పాప శిక్షను యేసు భరియించెనే - ప్రవహించే రక్తధాఇర - నీ కోసమే కడుఘోర హింసనొందె - నీ కోసమే ఎందాక యేసుని నీవు - ఎరుగనందువు - ఎందాక హృదయం బయట నిలువ మందువు - యేసయ్య ప్రేమ నీకు లోకువాయేనా యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా ఈ లోక' భోగములను - వీడజాలవా - సాతాను బంధక మందు సంతసింతువా - యేసయ్య సహనముతోడ - చెలగాటమా ఈనాడే రక్షణదినము - గ్రహించుమా .... లోకాన ఎవ్వరు నీకై - మరణించరు - నీ శిక్షలను భరియింప సాహసించరు - నీ తల్లియైన గాని నిన్ను మరచునే ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువ జాలునా...


Follow Us