LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


సమయమిదే


సమయమిదే సమయమిదే - సంఘమ సమయమిదే
సీయోనులో చేరుటకు - సంఘమ సమయమిదే

చూడుము భూమిమీద - పాప చీకటి కమ్మియున్నది
బ్యోతివలె జీవించుము - జీవవాక్యము పట్టుకొని

ధూళి దులుపుకొనుము - నీ మెడకట్లు విప్పుకొనుము
సుందరమైన వస్త్రము - వేగము ధరించి సిద్ధపడుము

నిలువుము సత్యముకై - సువార్తకు పోరాడుము
సేవను చేసి నీవు - త్యాగము చేయుము ప్రాణమును

సీయోను శత్రువులు - సిగ్గుపడుదురు నిశ్చయముగా
సీయోను నీ పరుగు - తుద ముట్టించుము త్వరితముగా

సీయోనులో వశించు - సర్వశక్తుడు నీ ద్వారా
శోధింప ఈ దినము - మార్పు నొందుము స్పటికముగ

పిలుపుకు తగినట్లుగా - నీవు నడువుము ప్రభుయేసుతో
ప్రేమలోనే నిలువుము - నిత్యజీవము చేపట్టుము

సీయోను రారాజు - నిన్ను చూచి ఏతెంచెదరు
మహిమగల కిరీటము - నీకు ఆయన ఇచ్చెదరు

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words