
సర్వ యుగములలో సజీవుడవు
సర్వ యుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును కొనియాదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా (2) ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే (2) శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా (2) ||సర్వ యుగములలో|| స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే (2) నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను మరణము గెలిచిన బహు ధీరుడా (2) ||సర్వ యుగములలో|| కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహు తరములకు క్షోభాతిశయముగా చేసితివి నన్ను (2) నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు నణచిన బహు శూరుడా (2) ||సర్వ యుగములలో||


Follow Us