LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


సర్వకృపానిధియగు


సర్వకృపానిధియగు ప్రభువా - సకల చరాచర సంతోషమా
స్తోత్రముచేసి స్తుతించెదను - సంతసమున నిన్ను పొగడెదను
అ. ప || హల్లెలూయ - హల్లెలూయ 
హల్లెలూయని పాడెదను - ఆనందముతో సాగెదను

ప్రేమించి నన్ను వెదకితివి - ప్రీతితో నన్ను రక్షించితివి
పరిశుద్ధ జీవితము చేయుటకై - పాపిని నన్ను కరుణించితివి

అల్పకాల శ్రమలనుభవింప - అనుదినము కృపనిచ్చితివి
నాధుని అడుగు జాడలలో - నడచుటకు నన్ను పిలిచితివి

మరణ శరీరము మార్పునొంది - మహిమ శరీరము పొందుటకై
మహిమాత్మతో నన్ను నింపితివి - మరణ భయములను తీర్చితివి

భువినుండి శ్రేష్టఫలముగాను - దేవునికి నిత్య స్వాస్థ్యముగా
భూజనములలో నుండి నన్ను - ప్రేమించి క్రయధన మిచ్చితివి

ఎవరు పాడని గీతములు - యేసుతో నేను పాడుటకై
హేతువు లేకయే ప్రేమించెన్ - యేసుకు నేనే మివ్వగలన్

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words