LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


సర్వచిత్తంబు


సర్వచిత్తంబు నీదేనయ్యా - స్వరూపమిచ్చు కుమ్మరివే
సారె పైనున్న మంటినయ్యా - సరియైన పాత్రన్ చేయుమయ్యా
సర్వేశ్వరా నే రిక్తుండను - సర్వదా నిన్నే సేవింతును

ప్రభూ సిద్ధించు నీ చిత్తమే - ప్రార్థించుచుంటి నీ సన్నిధిన్
పరికింపు నన్నీ దివసంబున - పరిశుభ్రమైన హిమముకన్న
పరిశుద్ధున్ జేసి పాలింపుమా - పాపంబు బ్రోవ నను కడుగుమా

నీ చిత్తమే సిద్ధించు ప్రభూ - నిన్నే ప్రార్థింతు నా రక్షకా
నీచమౌ గాయములచేతను - నిత్యంబు కృంగి అలసియుండ
నిజమైన సర్వశక్తుండవే - నీ చేత బట్టినన్ రక్షింపుమా 

ఆత్మ స్వరూప నీ చిత్తమే - అనిశంబు చెల్లు యిహపరమున
అధికంబుగా నన్నీ యాత్మతో - ఆవరింపుమో - నా రక్షకా
అందరు నాలో క్రీస్తుని జూడ - ఆత్మతో నన్ను నింపుము దేవా

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words