
సర్వాధికారివి సర్వజ్ఞుడవు
సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు } 2 దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నను నింపితివా } 2 అతిసుందరుడా నా స్తుతి సదయుడ కోటి సూర్య కాంతులైనా నీతో సమమగునా } 2 ఎనలేనే నీ ఘనకార్యములు తలచి స్తుతించుచు నిను నే మహిమపరతును } 2|| సర్వాధికారివి || బలశౌర్యములుగల నా యేసయ్యా శతకోటి సైన్యములైనా నీకు సాటి అగుదురా మారవే నీ సాహసకార్యములు యెన్నడు ధైర్యముగా నిను వెంబడింతును } 2|| సర్వాధికారివి || సర్వజగద్రక్షకూడా - లోకరాజ్యపాలక భూరాజులెవ్వరినైన నీతో పోల్చగలనా } 2 బలమైన నీ రాజ్యస్థాపనకై నిలిచి నిరీక్షణతో నే సాగిపోదును } 2


Follow Us